ad1
ad1
Card image cap
Tags  

  04-06-2024       RJ

మూడోసారి అధికారం కమలదళానిదే.. సీట్లు తగ్గినా.. అధిక్యంలోనే

జాతీయం

  • 300 మార్క్‌ సీట్లలో ఆధిక్యం
  • పలు రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌ స్వీప్‌ దిశగా బీజేపీ
  • బీహార్‌లో ఆర్జెడికి కోలుకోలేని దెబ్బ
  • 29 స్థానాల్లో ఎన్‌డిఎ కూటమికి అవకాశాలు
  • ఒడిశాలో ముగిసిన నవీన్‌ పట్నాయక్‌ శకం
  • బీజేడీ ప్రభుత్వానికి బీజేపీ చెక్‌
  • నవీన్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్‌
  • స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు

న్యూఢిల్లీ, జూన్‌ 4: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్‌ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే.. 300 మార్క్‌ సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌ స్వీప్‌ దిశగా సాగుతోంది. యూపీ, మహారాష్ట్ర, వెస్ట్‌ బెంగాల్‌ లాంటి పెద్ద రాష్ట్రాల్లో నెక్‌ టు నెక్‌ ఫైట్‌ నడుస్తోంది. దేశం లోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. అక్కడి 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది.. ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం కనబరుస్తోండగా.. బీజేపీ 36 స్థానాల్లో మాత్రమే లీడిరగ్‌ లో ఉంది. గత ఎన్నికల్లో 62 స్థానాలు ఈ రాష్ట్రం లోనే గెలిచిన బీజేపీకి, ఈ సారి ఎదురు గాలి వీస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉండగా.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌ లో 26 స్థానాల్లో ఎన్డీయే, 20 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. వెస్ట్‌ బెంగాల్‌ లోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ హవా కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన టీఎంసీ.. ఈ సారి కూడా 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, 2019 ఎన్నికల్లో 18 స్థానాలు గెలిచిన బీజేపీ మాత్రం 12 స్థానాల్లోనే లీడిరగ్‌ లో ఉంది.. మెజారిటీ స్థానాలు సాధించాల్సిన పెద్ద రాష్ట్రాల్లోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో.. భారీ మెజారిటీపై అంచనాలు పెట్టుకున్న ఎన్డీయే 3 వందల స్థానాల దగ్గరే ఆగి పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గెలుపొందారు.

తన సవిూప కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో అమిత్‌ షాకు 5,06,731 ఓట్లు రాగా, రమణ్‌భాయ్‌కి 1,10,219 ఓట్లు పోలయ్యాయి. ఇక బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహమ్మద్‌ అనీశ్‌ దేశాయ్‌కి డిపాజిట్‌ దక్కలేదు. ఆయనకు 3,244 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, కేంద్రంలో ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 297 చోట్ల ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్‌ 225 స్థానాల్లో మెజార్టీలో ఉన్నది. ఇప్పటివరకు ఇరు కూటములు ఒక్కో చోట విజయం సాధించారు. మరో 19 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్‌లో ఆర్జేడీకి కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది.

రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్‌లో ఉండగా, బీజేపీ 11 చోట్ల, లోక్‌జనశక్తి 5 చోట్ల తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్‌ 2, సీపీఐ, కాంగ్రెస్‌, హెఏఎంఎస్‌ ఒక్కో చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 సీట్లలో లీడ్‌లో ఉన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కుమార్తె విూసా భారతి పాటలీపుత్రలో బీజేపీపై 6,665 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సరన్‌లో పోటీచేస్తున్న లాలూ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ అభ్యర్థి 998 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో దేశ రాజకీయాలు మారుతున్నాయి.

ఇప్పుడు అంతా మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టే ఛాన్స్‌ కోసం చూస్తున్నారు. యూ`టర్న్‌ రారాజు’గా పేరొందిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి యూ`టర్న్‌ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన.. ఇప్పుడు తిరిగి ఇండియా కూటమిలోకి వెళ్లబోతున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు అవుననే సమాధానాలే రాజకీయ విశ్లేషకుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్‌.. ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ని దాటేసిన మాట వాస్తవమే. కానీ.. ఇండియా కూటమికి వచ్చిన స్థానాలు మాత్రం ఎవ్వరూ ఊహించనివి. ఎన్నికల ముందు బీజేపీ హవా ఎక్కువగా ఉండటం చూసి.. ఇండియా కూటమికి కనీసం 150 స్థానాలు కూడా రాకపోవచ్చని అందరూ అంచనా వేశారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవే లెక్కలు చెప్పాయి. ఈసారి ఎన్డీఏ 350కి పైగా స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, ఇండియా కూటమి 150 స్థానాల్లోపే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా కూటమి దూసుకుపోతోంది. 230 నుంచి 240 స్థానాల్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే.. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 272కు దరిదాపుల్లో ఆ కూటమి ఉంది. ఇలాంటి తరుణంలో.. నితీశ్‌ కుమార్‌ తిరిగి ఇండియా అలయన్స్‌లోకి వస్తే, కూటమి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కొన్ని రోజుల క్రితమే.. ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఒక పెద్ద ప్రకటన చేశారు. తన పార్టీని కాపాడుకోవడం కోసం నితీశ్‌ కుమార్‌ ఏమైనా చేస్తారని, అందుకోసం జూన్‌ 4వ తేదీ తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు.

అంటే.. ఇండియా కూటమిలోకి ఆయన తిరిగి రావొచ్చని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అసలే ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్‌ కుమార్‌ అత్యంత కీలక పాత్ర పోషించారు కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కూటమిలోకి తిరిగొచ్చినా ఆశ్చర్యనపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. ఎన్డీఏకు ఆయన గండి కొట్టినట్టే! అప్పుడు ఇండియా కూటమికే గెలుపవకాశాలు ఉంటాయి. కేవలం నితీశ్‌ కుమార్‌ రావడంతో ఇండియా కూటమికి ఆధిక్యం దక్కకపోవచ్చు. కానీ, ఆయన ఇచ్చే ట్విస్ట్‌కి ఇతర ప్రాంతీయ పార్టీలూ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి 240 స్థానాల్లో నెగ్గి, అటు జనతాదళ్‌ (యూ) బిహార్‌లో 13`14 సీట్లు గెలిస్తే.. అప్పుడు ఇండియా కూటమి ఖాతాలోకి 253`254 సీట్లు వచ్చి చేరుతాయి.

మరోవైపు.. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కి అటుఇటుగా స్థానాల్ని కైవసం చేసుకోవచ్చు. కాబట్టి.. ఇండియా కూటమి గెలవాలంటే, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకోవాల్సి వస్తుంది. మరి.. ్గªనైల్‌ రిజల్ట్స్‌ ఎలా వస్తాయో చూడాలి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార బిజూ జనతాదళ్‌ పార్టీ ఫలితాల సరళిలో వెనుకంజలో ఉంది. దాదాపు ఓటమి దిశగా పతనం అంచున పయనిస్తోంది. ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు ఆ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజూ జనతా దళ్‌(బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌.. ఈ సారి డబుల్‌ హ్యాట్రిక్‌పై కన్నేశారు. కానీ నవీన్‌ పట్నాయక్‌ ఆశలు ఆవిరయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార బిజూ జనతా దళ్‌ తర్వాత స్థానంలో ఉంది. ఈ దఫా ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌?కు బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైంది. సంబల్‌ పుర్‌?లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఆధిక్యంలో ఉండగా, పూరీ నుంచి సంబిత్‌ పాత్రా ముందంజలో ఉన్నారు.

బిజూ జనతా దళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ కంటాబాంజీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదల్‌ (బీజేడీ) వెనుకబడిరది. నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యంపై బీజేపీ చేసిన వ్యతిరేక ప్రచారం వర్కవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీనిపై నవీన్‌ పట్నాయక్‌ మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాగా సుదీర్ఘ కాలంగా పవర్‌లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది.మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 74, బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఫలితాల సరళి ప్రకారం బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

కాషాయ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ దాటి అత్యధిక సీట్లలో ముందుండగా బీజేడీ తక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 12 సీట్లలో ఇతరులు 3 సీట్లలో ముందంజలో ఉన్నారు. ఒడిశాలో అధికార బీజేడీకి బిగ్‌ షాక్‌ తగిలింది. రాష్ట్రంలో తొలిసారి అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ పయనిస్తోంది. అత్యధిక అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బిజూ జనతా దళ్‌ తర్వాత స్థానంలో ఉంది. ఈ దఫా ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌?కు బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైంది. సంబల్‌ పుర్‌?లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఆధిక్యంలో ఉండగా, పూరీ నుంచి సంబిత్‌ పాత్రా ముందంజలో ఉన్నారు. బిజూ జనతా దళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ కంటాబాంజీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా డబుల్‌ హ్యాట్రిక్‌ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై కన్నేసిన బీజేపీ.. నవీన్‌ దూకుడుకు బ్రేక్‌ వేసింది. పట్నాయక్‌ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒడిశాలో పనిచేశాయి. కాంటబంజి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవీక పట్నాయక్‌ వెనుకంజలో ఉన్నారు.. ఒడిషాలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా కొనసాగుతోంది.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP