04-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 4: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మోదీని ఓడిరచారని తేల్చి చెప్పారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. మోదీ, అమిత్‌షాలు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నిల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని సెటైర్లు వేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేసినట్టు స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఐకమత్యంతో పని చేసిందని వెల్లడిరచారు. బీజేపీతో పాటు ఎన్నో సంస్థలతో పోరాడామని రాహుల్ వివరించారు. ఈ ఎన్నికల్లో మేం పోరాడిరది కేవలం బీజేపీతోనే కాదు. ఎన్నో సంస్థలతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ దేశ వ్యవస్థతో పోరాటం చేశాం. సీబీఐ,ఈడీ దర్యాప్తు సంస్థలతోనూ పోరాటం చేశాం.
ఈ సంస్థలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడించారు. దేశ ప్రజలు మోదీని ఓడించారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసింది. దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విూడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు పార్టీలను విడదీసి సీఎంలను జైలులో పెట్టారని విమర్శించారు. మోదీ,అదానీల మధ్య ఉన్నది అవినీతి బంధం అని ఆరోపించారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈడి, సీఐడీలను సొంత ప్రయోజనాలకు బీజేపీ వాడుకుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని అన్నారు.
ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం పనిచేశారన్న రాహుల్ వారందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లి కార్జున ఖర్గేఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పోరాటం బవిష్యత్తు లో కూడా కొనసాగుతుందని తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర పార్టీకి ఎంతో ఉపయోగపడిరదని అన్నారు. తమతో కలిసి నడిచిన అన్ని పార్టీలకు అభినందనలు అని అన్నారు. ఐక్యమత్యంతో మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని ..ఇది మోదీ పరాజయం అని విమర్శించారు. విూడియా సామవేశంలో సోనియా, జైరామ్ రమేశ్ కూడా పాల్గొన్నారు.