04-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 4: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఫలితాల తరవాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న ..ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోది.... సబ్‌కా సాత్ .. సబ్‌కా వికాస్ మంత్రం గెలిచిందన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్లలో చేసిన అభివృద్దిని కొనసాగిస్తామన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యన్నతికి పాటుపడతామన్నారు. 2024 ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు కృతఙ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం దేశానికే ఆదర్శమన్నారు. ఇది వికసిత భారత్‌కు స్ఫూర్తి విజయమన్నారు. జమ్ముకశ్మీర్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారన్న మోదీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విక్టరీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారన్నారు.
బీజేపీకి దేశ ప్రజలు అద్భుతమైన విజయాన్నిఅందిచారని... తెలంగాణలో బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. ఏపీ అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో దేశంలో బీజేపీ గెలిచిందన్నారు. 1992 తరువాత కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలో.. బీహార్ లో నితీష్ ఆధ్వర్వంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. కేరళలో తొలిసారి బీజేపీ ఒక స్థానంలో గెలుపొందామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తుందని ప్రధాని మోది అన్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉందన్నారు, ఇది భారతీయుల విజయమన్న మోదీ.. దేశ అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశాన్ని సాంకేతిరంగంలో అభివృద్ది చేస్తామన్నారు.
అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఎన్డీఏ పాలన చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజనీతికి కట్టుబడి ఉందన్నారు. ఎన్డీఏ విజయం సాధించడంలో జేపీ నడ్డా చేసిన కృషిని కొనియాడారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు మోదీ... మోదీ అంటూ నినాదాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తరువాత బీజేపీ అగ్రనేతలు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. జేపీ నడ్డా మాట్లాడుతూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన తీర్పు అని నడ్డా అన్నారు. బీజేపీ గెలుపునకు కృషి చేసిన వారందరికి కృతఙ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్దిని కొనసాగిస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడాబీజేపీ జండా రెపరెపలాడిరదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. ఇండియా కూటమి చేసిన స్వార్థ పూరిత రాజకీయాలు ఫలించలేదన్నారు. . ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మోదీ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడిరదన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.