07-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 7: ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ భాజపా కురువృద్ధుడు ఎల్.కె.అడ్వాణీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆయన ఇంటికివెళ్లిన మోదీ... వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న విషయాన్ని ఆయనకు స్వయంగా చెప్పారు. ఇద్దరు నేతలూ వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లిన మోదీ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
తమ వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని చెబుతూ.. అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేయనున్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని లోక్‌సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.