07-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 7: తమ కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీని ఏన్డీయే నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై మోదీ మాట్లాడుతూ.. తన మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్యాబినెట్ బెర్త్‌ల విషయంలో బురిడీ కొట్టించేవారుంటారని జాగ్రత్త అని చెప్పారు. ఈసందర్భంగా ఆయన చెప్పిన మాటలతో కూటమి ఎంపీలంతా చిరునవ్వులు చిందించారు. కొంతమంది విూ దగ్గరకు వచ్చి, క్యాబినెట్ బెర్త్ ఇప్పిస్తామని చెప్తారు. టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే.. నా సంతకాలతో ఉన్న జాబితా బయటకు రావొచ్చు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కుట్రలకు చిక్కొద్దని ఎంపీలను కోరుతున్నాను. ఈ విషయంలో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉంది. వారు తమ నైపుణ్యాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది.
వదంతులకు దూరంగా ఉండండి. సంచలనాల కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలతో దేశాన్ని నడపించలేం‘ అని నవ్వుతూనే హెచ్చరిక చేశారు. నకిలీ సమాచార వ్యాప్తిని ఉద్దేశించే ఆయన ఈవిధంగా స్పందించారు. ఇక ఈ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఔఆం అంటే ’న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు. విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని ఎద్దేవా చేశారు. మరో పదేళ్లయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్‌ను దాటలేదు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.