08-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 8: మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ విూడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు. భారతీయ విూడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా విూడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడిరచారు. ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ విూడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ప్రధాని మోదీ అభివర్ణించారు.
దీంతోపాటు ఆయనతో మాట్లాడటం, ఆయన నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు లభించడం నా అదృష్టమని మోదీ అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన మృతి దిగ్భార్రతికి గురిచేసినట్లు తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతితో దేశం ఓ విూడియా దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. ’రామోజీ మరణంతో విూడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది.
రామోజీరావు ఓ వినూత్న వ్యాపారవేత్త. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్రవేశారు. విూడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ముర్ము తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, మల్లికార్జున ఖర్గే సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం విూడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. విూడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు.
ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. సినీ నిర్మాతగా, విూడియా సంస్థల అధినేతగా, విద్యావేత్తగా రామోజీరావు అనేక సేవలు అందించారని, ఆయన మరణం విచారకరమన్నారు. విూడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి రామోజీరావు అని అన్నారు. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఖర్గే ప్రకటించారు.ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుమృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
’ఈనాడు గ్రూప్, ఈటీవీ నెట్‌వర్క్, ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు విూడియాకు ఆయన దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్‌సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభులాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని దీదీ పోస్ట్ పెట్టారు.