08-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 8: తెలంగాణ మాజీ గవర్నర్, బిజెపి నేత తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ భవన్‌ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటోను ఆమె ఎక్స్ వేదికలో పంచుకున్నారు. రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్ ఆమెకు స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళిసై హాజరవుతున్నారు. అందుకే ఆమె న్యూఢిల్లీ వెళ్లారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 8 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.