12-06-2024 RJ
జాతీయం
డెహ్రాడూన్: ఉత్తరకాశీలోని గంగానది సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో ముగ్గురు మహిళలు మరణించగా, మరో 14 మంది గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు గంగోత్రి ధామ్ నుంచి ఉత్తరకాశీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు, ముగ్గురు మహిళా ప్రయాణికులు మరణించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, రెవెన్యూ, ప్రతిస్పందన బృందాలతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిమ్స్ రిషికేశ్ మరియు డూన్ హాస్పిటల్ డెహ్రాడూన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.