13-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 13: కేంద్ర గ్రావిూణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ‘నాకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీ, చంద్రబాబులకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
పదవి నిర్వహణలో రాణిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మోదీతో పాటు బీజేపీ నాయకత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మార్గదర్శకత్వం కోసం ఇద్దరు డైనమిక్ వ్యక్తులైన శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింథియాలను అప్పగించారని కొనియారు. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.