14-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 14: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ వరుస సమావేశాలతో బీజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈసందర్భంగా జీ7 దేశాల అధినేతలతో ఆయన వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో సంభాషించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మోదీ మధ్య కూడా భేటీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడిరచారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో పశ్చిమదేశాల ఒత్తిడిని అధిగమించి, భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే.. రష్యా వ్యతిరేకంగా ఐరాసలో జరిగిన ఓటింగ్‌కు పలుమార్లు దూరంగా ఉంది.
ఇదిలాఉంటే.. ప్రస్తుత సమావేశంలో పుతిన్ సేనలతో జరుగుతోన్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోదీకి జెలెన్ స్కీ వివరించినట్లు సమాచారం. ఇక ఈ జీ7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫాస్టక్చర్ర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, మేక్రాన్ చర్చలు జరిపారు. దాంతోపాటు పలు కీలక విషయాలపై తమ మధ్య చర్చ జరిగినట్లు మోదీ వెల్లడించారు.