15-06-2024 RJ
జాతీయం
కర్ణాటక, జూన్ 15: పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (కెఎస్‌టి) పెట్రోల్‌పై 25.92 శాతం నుండి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.02 పెరగనుంది. కాగా ఇప్పటికే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.50, డీజిల్ రూ. 86.56 ఉండగా పెరిగిన ధరలతో పెట్రోల్ 103.40, అలాగే డీజిల్ 89.58కి చేరనుంది. ఈ పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.