17-06-2024 RJ
జాతీయం
కోల్‌కతా, జూన్ 17: పశ్చిమ బెంగాల్లోని రంగపనీర్ స్టేషన్ సవిూపంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సిలిగురి దాటిన తర్వాత రంగ్‌పనీర్ స్టేషన్ సవిూపంలో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి చీ వేదికగా ఓ పోస్ట్ చేశారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. కాంచన్‌జంగా ఉన్న అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది.
దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. రెండు రైళ్లు ఢీ కొట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిండి. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఎన్‌ఎఫ్‌ఆర్ జోన్‌లో దురదృష్టకర ప్రమాదం జరిగిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.