18-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 18: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై విద్యార్థులు, విపక్షాలు ధర్నాలు చేస్తున్నా ప్రధాని ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్ ఎంపి రాహుల్ ప్రశ్నించారు. నీట్ పరీక్ష విషయంలో మౌనం వహిస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తమ గళాన్ని వినిపిస్తుందన్నారు.ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మంగళవారం విమర్శలు గుప్పించారు. పరీక్ష పేపర్ లీక్(లకు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంటు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాజపా? ఆ కూటమి పాలిత రాష్ట్రాలైన బిహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులు పరీక్షలో అవినీతి జరిగిందని రుజువు చేస్తున్నాయని చెప్పారు. నీట్ పరీక్షలో 24లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారు అయినా మోదీ ఏవిూ పట్టనట్లుగా ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాజపా పాలిత రాష్ట్రాలు పేపర్ లీక్‌కు కేంద్రంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేపర్ లీకేజీలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చిందన్న అంశాన్ని గుర్తు చేశారు. 2024 నీట్ పరీక్ష నిర్వహణలో ఎవరైనా 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా క్షుణ్ణంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఎన్‌టీఏ ఆల్ ఇండియా ప్రీ`మెడికల్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. మే 5న జరిగిన పరీక్షలో విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులతో సహా ఫిర్యాదుదారులు లేవనెత్తిన రెండు వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది.