20-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఆట పాటలు, యోగాసనాలతో పిల్లల్లో మానసిక ఆరోగ్యం నింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. క్రీడాంశాల్లో యోగగాను జోడించి అనేక ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఏటా విద్యాశాఖ ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తోంది. ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి మారిన పాఠ్యాంశాల ఆధారంగా బోధన తీరు మెరుగపడేలా చర్యలు తీసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా వ్యాయామ ఉపాధ్యా యులకు ఎలాంటి శిక్షణ తరగతులు లేవు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థుల ఆరోగ్యం, ఇతర అంశాలపై దృష్టిసారించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ ఇటీవల వ్యాయామ ఉపాధ్యాయులకు నాలుగు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించింది.
యోగా, ఆరోగ్యం, కరాటే, మానసిక అంశాలపై తర్పీదునిచ్చారు. విద్యార్థులకు ఆత్మస్థైర్యం పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతులు కరవయ్యాయి. ప్రార్థన చేసేందుకు స్థలం కొరత పీడిస్తోంది. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాదిలో స్వాతంత్య, గణతంత్య వేడుకల సమయంలో తప్ప క్రీడా పోటీల ఊసేలేదు. ఆసక్తి ఉన్నా విద్యార్థుల్లో ప్రతిభ కనుమరుగవుతోంది. అప్పడప్పుడు మండల, జిల్లా స్థాయి పోటీలకు తప్ప రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తింపు కరవైంది. సగానికిపైగా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాధాన్యం లేక నిరాశకు గురవుతున్నారు. ఇన్నాళ్లుగా ఈ అంశాలకు దూరమైన పిల్లలకు సంపూర్ణత చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
మానసిక వికాసం, శరీర దారుఢ్యంతోపాటు మెదడు చురుకుదనంతో ఉండేలా సమగ్ర నిరంతర మూల్యాంకనం విధానంలో భాగంగా వ్యాయామ విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. యోగా, ఆత్మరక్షణ కోసం కరాటే, క్రీడలు, ఆర్యోగంతో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్భా, ఆదర్శ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న వ్యాయమ ఉపాధ్యాయులకు గతంలో నాలుగు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. యోగాసనాలు, కరాటే, ఆటలు, ఆర్యోగం తదితర విషయలపై బోధన ఎలా చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల మేథస్సు ప్రశాంతత కోసం చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు ను చక్కదిద్దుకుంటారు. ఆటలతోపాటు వ్యక్తిగత ఆరోగ్య పాఠాలు బోధించాలని వివరించారు.
క్రీడల్లో ఉత్తేజపూరితంగా తర్పీదు ఇచ్చేలా శిక్షణ ఇచ్చారు. ప్రతి రోజు వ్యాయామ, ఆరోగ్య విద్యను అమలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రతి రోజు ఓ పీరియడ్ కేటాయించాలని నిర్ణయించారు.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజువారీగా నిర్ణయించిన ప్రణాళికను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. క్రీడా మైదానాలను సిద్దం చేయాలని, బ్జడెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయించారు. క్రీడలతో పాటు అª`లథెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. వీటిపై ఇతర పాఠ్యాంశాల మాదిరిగానే సమ్మెటీవ్-1,2 పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహిస్తూ జాతీయస్థాయిలో పాల్గొనేలా సిద్దం చేస్తారు. ఇతర దేశాల్లో బాల్య దశలోనే ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నారు. మన దగ్గర ఆటలాడుకోవాలనే ఆసక్తి ఉన్నా ఆట స్థలం కరవే...ప్రతిభ ఉన్నా శిక్షకుడి సేవలు దూరమే...ఎలాంటి శిక్షణ లేకున్నా ఏకలవ్యులా పలు పోటీల్లో విద్యార్థులు సత్తాచాటుతున్నారు.
సగానికిపైగా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ...మరికొన్నిటికి పోస్టుల మంజూరు లేదు...విద్యార్థుల్లో మానసిక పరిపక్వత లోపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతులు ఆందోళన కల్గిస్తున్నాయి. క్రీడా మైదానాలు లేని చోట సవిూపంలో అందుబాటు లో ఉన్న స్థలాలను ఎంపిక చేసుకుని తీసుకోవాలి. సగానికిపైగా ఖాళీలు ఉండటంతో వీటిని భర్తీ చేయాలి. క్రీడాకారుల ప్రయోజనం కోసం ఆట వస్తువులు, ఇతర వసతులు కోసం నిధులను కేటాయించాలి. విద్యాక మిటీ సభ్యులను భాగస్వాములను చేసి ప్రజా విరాళాలతో ముందుకుసాగేలా ప్రతిపాదనలు తయారు చేసుకోవాలి. ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ విద్య అమలు చేస్తున్నప్పటికీ ప్రాథమికస్థాయిలో లేకపోవడం అన్యాయమే. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్యను పకడ్బందీగా అమలు చేస్తుండగా ప్రైవేటు పాఠశాలల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే. పలు పాఠశాలలకు క్రీడా వసతులు లేవు.
పాఠశాలల గుర్తింపునకు ముందు కనీస వసతులు ఉంటేనే అనుమతి పత్రం ఇవ్వాలి. నిబంధనలు పాటించకుండానే అనుమతులు ఇవ్వడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రార్థన చేసుకునేందుకూ స్థలం లేకపోవడం గమనార్హం. ప్రైవేటు పాఠశాలల్లో కూడా వ్యాయమ విద్య పక్కాగా అమలు చేస్తే క్రీడా వెలుగులు అందుతాయి.