ad1
ad1
Card image cap
Tags  

  21-06-2024       RJ

సుస్థిరతకే దేశ ప్రజల ఓటు

జాతీయం

  • ఎన్‌డిఎ విజయంతో మరోమారు అధికారం
  • కాశ్మీర్‌లో ఎన్నికల తరవాత రాష్ట్రహోదా
  • అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

శ్రీనగర్‌, జూన్‌ 21: ’సుస్థిరత’కే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే తిరిగి రాష్ట్ర హోదా కలిగించున్నామనే సంకేతాలిస్తూ, అసెంబ్లీ ఎన్నికల ద్వారా కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయం ఎంతో దూరంలో లేదని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఫలితాలు చూపెట్టిందని, పనితీరు ఆధారంగానే ప్రజలు 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు.

తమకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ, గత శతాబ్దంలోని చివరి దశాబ్దంలో అస్థిర ప్రభుత్వాలను చూశామనీ, పదేళ్లలో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎన్నికలకే దేశం పరిమితమైందే కానీ ఎలాంటి ప్రగతి సాధించలేకపోయిందన్నారు. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి సమయంలో ఇండియాను ముందుకు తీసుకువెళ్తేందుకు తాము పగ్గాలు చేపట్టామని, పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ఇదంతా గతమని, ఇప్పుడు ఇండియా సుస్థిర ప్రభుత్వ శకంలోకి అడుగుపెట్టిందని, ప్రజాస్వామ్యం మరింత పటిష్టమైందని అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతలో జమ్మూకశ్మీర్‌ పాత్ర కీలకమని చెప్పారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరియత్‌ కోసం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నకలలు సాకారం కానున్నాయని అన్నారు. ఈ ఎన్నికలతో జమ్మూకశ్మీర్‌ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలు సైతం జరుగుతున్నాయని చెప్పారు. రూ.1,500 కోట్ల విలువచేసే 84 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను గురువారం ప్రారంభించనున్నట్టు కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.1,800 కోట్లతో వ్యవసాయరంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రారంభించ నున్నామని, కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించనున్నామని చెప్పారు. గత పదేళ్లలో కశ్మీర్‌ స్టార్టప్‌లు, స్కిల్‌ డవలప్‌మెంట్‌, క్రీడల్లో ముందుకు దూసుకెళ్లోందని, పాలిటెక్నిక్‌ సీట్లు పెరిగాయని, న్యూ స్కిల్స్‌కు అవకాశాలు పెరగాయని, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ నిర్మాణాలతో పాటు కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి స్థాపనకు అవరోధం కలిగిచే టెర్రరిస్టులకు గుణపాఠం చెప్పేందుకు తమ ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP