22-06-2024 RJ
జాతీయం
వాషింగ్టన్, జూన్ 22: సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక జూన్ 5న ఐఎస్‌ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి తిరుగు ప్రయాణానికీ సమస్యలు తలెత్తాయి. దీంతో ల్యాండిరగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండిరగ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడిరది. కొత్త తేదీని ఇంకా వెల్డించలేదు. అన్నీ అనుకూలిస్తే జులై 2న వీరి రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ, నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్ ఇది.
ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవసహిత యాత్ర. ప్రయోగం సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్, కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై వీరి అంతరిక్ష యానం పలుమార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 5న ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. అయితే, రోదసిలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. సునీతా విలియమ్స్‌కు ఇది ముచ్చటగా మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.