22-06-2024 RJ
జాతీయం
వారణాసి, జూన్ 22: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడిరచారు. కాశీలో పేరొందిన పండితుల్లో ఒకరిగా గుర్తింపుపొందిన లక్ష్మీకాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే, ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలోనే నివసిస్తోంది. మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మీకాంత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన్ను దేశంలోని గొప్ప పండితుల్లో ఒకరిగా పేర్కొన్న ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతులవిూదుగా అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే.