ad1
ad1
Card image cap
Tags  

  24-06-2024      

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా.. ముందుకు సాగుతాం

జాతీయం

  • గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ
  • 140కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా
  • రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగిస్తా
  • విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి
  • పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూన్‌ 24: వికసిత్‌ భారత్‌ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ పదేళ్ల పాలనానుభవం, కొత్త సభ్యుల ఆకాంక్షలు, దేశ ప్రజల ఆశల మేరకు ముందుకు సాగుతామని అన్నారు. మరింత కఠన శ్రమతో దేశానికి సేవచేస్తానని మోడీ ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయిన సందర్భం గా మోడీ విూడియాతో మాట్లాడారు. లోక్‌ సభ సభ్యులకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఇది చాలా పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరస్తామని, సామాన్య ప్రజల కలలు సాకారం చేస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకొని వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటామని మోడీ వివరించారు. ప్రజలు మా విధానాలను విశ్వసించారని, సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని, రేపటితో అత్యయిక పరిస్థితి 50 ఏళ్లు పూర్తివుతుందని, అత్యయిక పరిస్థితి ఒక మచ్చ అని, 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని మోడీ తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా ఇప్పటికే పార్లమెంట్‌ భవనానికి చేరుకున్నారు.

ఇక వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ విూడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ’ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్లు ఈ పక్రియలో పాల్గొన్నారు. మా విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించింది. ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం.

కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి. 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతాం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు 50 ఏళ్లు అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ప్రజలను జైళ్లలో వేసినట్లు చెప్పారు. 50 ఏళ్లకిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదన్నారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతం పలికారు.  

స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం మన కొత్త పార్లమెంట్‌  భవనంలో జరగనుంది. ఈ శుభ సమయాన కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలు మా విధానాలను విశ్వసించారు. దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సరికొత్త విశ్వాసంతో నేడు కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు చురకలంటించారు. ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని ప్రధాని హితవు పలికారు. 

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP