26-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 26: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని దిల్లీలో బుధవారం ఏపీ భాజపా ఎంపీలు కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌లు.. కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని కోరారు. భాజపా ఎంపీలు చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. మరోసారి సమావేశమవుదామని తెలిపారు.