26-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం దిల్లీలో తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే అయిదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో తెదేపా, భాజపా కలిసి పని చేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ’ఎక్స్’లో పోస్టు పెట్టారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.