27-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 27: ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమని తెలిపారు. విద్యుత్తు, బ్యాంకింగేతర ఆర్థికసంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగాల సమస్యలు సత్వరం పరిష్కరించాల్సి ఉందని, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు సరికొత్త సంస్కరణలు అవసరమని తెలిపారు. ప్రైవేటురంగ విశ్లేషకుల నుంచి వృద్ధిరేటు అంచనాలు వేర్వేరుగా ఉంటున్నాయని, వీటిల్లో చాలావరకు ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా ఉంటున్నాయని అప్పట్లో పదేపదే రాజన్ గుర్తు చేశారు. దేశంలో ఆటోమొబైల్ రంగ క్షీణత అన్నది నిరుద్యోగాన్ని పెంచే చర్యగా చూడాల్సి ఉంది.
కంపెనీలు అమ్మకాలు లేకుండా మూతపడితే నష్టమని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని, పరిష్కారానికి నూతన సంస్కరణలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ గవర్నర్ రఘురామ్ రాజన్ అప్పట్లో చేసిన హెచ్చరికలు పట్టించు కోలేదు. మొత్తం విూద ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. వివిధ రంగాలు ఇబ్బంది పడుతున్నా, వాహన రంగం మాత్రం రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే. వాహన, అనుబంధ రంగాల్లో వేలసంఖ్యలో ఉద్యోగాలు తొలగి స్తున్నారని, స్థిరాస్తి రంగంలో అమ్ముడు కాకుండా నిర్మాణాలు భారీగా మిగిలిపోతున్నాయని, ఎఫ్‌ఎంసీజీ రంగంలో విక్రయాలు తగ్గుతున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆయా రంగాల నుంచి ఉద్దీపనల కోసం విజ్ఞప్తులు అధికమవుతున్నాయని రాజన్ గుర్తు చేశారు. ప్రస్తుతం కంటే వృద్ధిరేటును మరో 2-3 శాతం పెంచాలంటే, ఏ విధంగా దేశాన్ని ముందుకు నడిపించాలనే విషయంపై అవగాహన ఉండాలి.
విద్యుత్తు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో సత్వరం సమస్యలు పరిష్కరించాలి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు వచ్చేలా దీర్ఘకాలిక దృక్పథం కలిగిన సంస్కరణలూ కావాలి. ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు తాత్కాలికంగా మాత్రమే ఉపకరిస్తాయి. జీడీపీని మనం ఎలా గణిస్తున్నామో, స్వతంత్ర నిపుణుల పర్యవేక్షణ ఉండాలని రాజన్ విశదీకరించారు. గత ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యాంకుల స్థితి బాగానే ఉందని రాజన్ తెలిపారు.2008లో పరపతి విధానం కీలకమైంది. ఇప్పుడు మెరుగైన విధానం కాదు, ప్రత్యేక విధానం కావాలి. మరో భారీ ఆర్థిక సంక్షోభం వస్తుందని భావించడం లేదని అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని అంచనాలు తలకిందులు అయ్యాయి. వాటిని గమనంలోకి తీసుకుని ముందుకు సాగాల్సిన సమయమిదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. బ్యాంకింగ్ రంగాన్ని పట్టాలకెక్కించేందుకు అన్ని బ్యాంకులు యత్నిస్తున్నాయి.
గృహ,వాహన రుణాలపై వడ్డీలు తడిసి మోపెడు కావడంతో మందగమనం కనిపిస్తోంది. అలాగే కస్టమర్లపై ఎడాపెడా వడ్డింపులకు దూరంగా ఉండాలని నిపుణులు చూస్తున్నారు.. ఇప్పటికే బ్యాంకుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృష్తి ఉంది.ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని చూస్తోంది. యోనో వంటి యాప్‌ల ద్వారా, దేశీయంగా డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశం మొత్తంవిూద దాదాపు 93 కోట్ల డెబిట్, క్రెడిట్‌కార్డులు వినియోగంలో ఉన్నాయని వెల్లడించారు. యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించవచ్చని, కార్డు లేకుండా దుకాణాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.