27-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 27: తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై మూత్ర ,గుండె, వృద్దాప్యంకు సంబంధించిన ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య బృందం స్పష్టం చేసింది. దీంతో ఆయన్ని డిశార్చ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిరచాయి. 96 ఏళ్ల ఎల్ కె అద్వానీ బుధవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అల్ ఇండియా మెడికల్ సైన్సెన్స్ ఎయిమ్స్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.