28-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 28: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం రైతు రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగస్టు-15 లోగా ఈ హావిూని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పక్రియ కూడా దాదాపు మొదలైంది. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన సీఎం.. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని.. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని.. మరోసారి స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావని కూడా సీఎం చెప్పేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయన్నారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాం. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడని అధికారులను ఆదేశాలు ఇచ్చాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తర్వాత డ్యాం సేప్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తాం అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది.
ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 30శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సరే.. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించిన తరువాత కుల గణన చేస్తాం అన్నారు. రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రతి నెల రూ. 7వేల కోట్ల అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ. 6,500 కోట్లు కట్టేవారు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తెచ్చారు. రుణభారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నాం. ఒక్కశాతం తగ్గినా రూ. 700 కోట్లు ఆదా అవుతాయి. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. బడ్జెట్ కు ముందే రాష్టాన్రికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం.
అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు.. కేంద్రమంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ’ధరణి’లో ఉన్న లోపాలు సరి చేసే పనిలో ఉన్నాము. ఆ తరవాత ఏ పేరు పెట్టినా నడుస్తుంది. కంప్యూటరైజ్ చేయాలా..? లేక మాన్యూవల్ పద్ధతి పాటించాలా..? రెండే పద్ధతులు. ఏది చేయాలో అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఏ పాలసీ అయినా... ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పు చేర్పులతో తుది విధానం ప్రకటన చేస్తామని అన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్స్‌లో రూల్స్ బ్రేక్ చేయం. కేసీఆర్ చేసిన తప్పులను మేం చెయ్యం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ’రాష్ట్రంలో విద్యుత్ కోత లేదు పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చే సరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనులు జరగడం వల్ల అంతరాయం ఏర్పడిరది.
బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం వల్ల టెంపుల్ టూరిజం పెరిగింది. అక్కడ జీఎస్టీ కూడా పెరిగింది’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. ’రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తరువాత రైతు బంధు ఇతర పథకాల పై దృష్టి పెడతాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయం లో కవిూషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి. మోదీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరు..? కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారు’ అని ఉదహరించి మరీ రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు మహిళలకు పీసీసీ ఇస్తే బానే ఉంటుందని సీఎం సమాధానం ఇచ్చారు.
విలేకరుల సూచనలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చని.. సామాజిక న్యాయంలో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీలు కూడా ఉండొచ్చన్నారు. ఫిరాయింపుల తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదని.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారన్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు, తాము చేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తకొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సవిూకరణాలు దృష్టిలో ఉంచుకుని హై కమాండ్ డిసైడ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ బీ ఫామ్ మిద గెలిచిన వారికి మాత్రమే పదవులు వచ్చాయి. పీసీసీ చీఫ్‌గా రెండు ఎన్నికలు పూర్తి చేశా. జూలై 7 తో మూడేళ్లు పీసీసీ పూర్తి కానుంది. పీసీసీ , కేబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకే సారి ఫైనల్ అవుతాయని అన్నారు.