29-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 29: భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు విమర్శించారు. ఈ ఘటనతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ’విమానాశ్రయ టెర్మినల్ కూలిన ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారు అసత్యాలు ప్రచారం ప్రచారం చేస్తున్నారు. కూలిన భవనం 15 ఏళ్ల క్రితం అంటే 2009లో ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన టెర్మినల్ వేరు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయడం సరికాదు’ అని రామ్మోహన్ పేర్కొన్నారు. పైకప్పు కూలిన ఘటనపై తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో వెల్లడిరచారు. టెర్మినల్ వన్ వద్ద ఉన్న ప్రయాణీకులందరికీ సహాయం వెంటనే అందించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
ఘటనలో ఒకరు చనిపోగా.. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. విమానాశ్రయ టర్మినల్ కూలిన ఘటనపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మాట్లాడుతూ.. ’గత పదేళ్లలో మోదీ పాలనలో దేశంలో జరిగిన నాసిరకం పనులకు తాజాగా జరిగిన ఘటనలు నిదర్శనం. అయోధ్యలో నీటి లీకేజ్, విమానాశ్రయం కూలిపోవడం తదితర సమస్యలన్నీ నాసిరకం పనుల వల్లే జరిగాయి. 2023-24లలో డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్మించిన 13 కొత్త వంతెనలు కూలిపోయాయి. గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి కూలింది. అయోధ్యలో కొత్త రోడ్లు అధ్వానంగా మారాయి. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు వచ్చాయి. ఇదంతా మోదీ ప్రభుత్త నిర్లక్ష్యం వల్ల జరిగినవే’ అని ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు.